గంగా తాండవం

  • 0
















ఉరికింది ఉరికింది ఆకాశగంగ,
హరుడు హరించమని అడుగంగ,
అడుగులో అడుగై నేలంతా మడుగై,
పాపం పుణ్యం అన్నీ మరిచి,
పిన్నలు పెద్దలు భేధం విడిచి,
నింగినుండి నేలకు జారి, ఆ రెండింటిని ఏకం చేస్తూ,
శివుడే నేల చేరి నాట్యమాడేనా అనేట్టుగా,
ఆ హరునే హరిస్తుందేమో అనేంతగా,
ఉరికింది ఉరికింది ఆకాశగంగ.

గంగమ్మను ఇన్నాళ్ళు మోసిన శివయ్య, ఇక చాలనుకుని,
ఇంతమందిని పొట్టనపెట్టుకోమని ఆఙాపించావా?
నీ ఆఙ లేనిదే చీమైనా చలించదు కదా,
నిన్ను చూడ వచ్చినవారిని నీలో చేర్చుకున్నవా?
అందుకే అందర్నీ ముంచిన ఆ హిమగంగ,
నిన్ను తాకే ధైర్యం చేయలేదుగా,
ఆఙా నీదీ,ఆది అంతం నీదీ,ఐక్యం అయ్యే శివ తాండవం నీది!!


-- మీ సాయి కార్తీక్

No comments:

Post a Comment