నేరం నాది కాదు, నీది, నరకయాతన నీది కాదు, నాది,
మనసు గాయం మాసి పోదు మదిని వీడి వెళ్ళిపోదు,నిన్నలోని నిరీక్షన, కన్నీరై కరిగిన క్షణాన,
మనసు గాయం లోతు ఎంతో గుండె అడుగునున్న ఆ కన్నీటినడగాలి.
స్వేచ్చగా వచ్చి నా తలుపు తట్టి వచ్చి చేరిపోయావు,
వెళ్తూ వెళ్తూ స్వఛ్ఛమైన నా గుండె గుడిని మార్చేసావు,నీతో ఉన్న నిన్నటి ఆ తీపి క్షణం, తలుచుకోలేను మరే క్షణం.
మనసంటే అద్దం అంటారు ముక్కలైతే అతకదంటారు,
నీకోసం పేర్చా ప్రతీ సారీ విరిగిన వెంటనే, నీ కొసం,గుచ్చుకున్న గాజు భాధంతా గుండెల్లో దాచి,
నిలబడ్డా ప్రతీ సారీ నీ బొమ్మ చుడాలని, ఆ అద్దంలో.
ప్రతి మాటా ప్రతి పలుకు గాలి లో కలవచ్చు కానీ,
మద్యలో అవి తాకిన మది తలుపులు, పదిలం చెశాయి నీ ప్రతి మాటా,వస్తావో వెళ్తావో వుంటావూ వీడతావో,
నిర్ణయం నాది కాదు, నీది, యాతన నీది కాదు, నాది.
-- మీ సాయి కార్తీక్
