'అ' శాశ్వతమైన - 'మనీ' షి

  • 0


అశాశ్వతమైన ఈ ప్రపంచం లో, శాశ్వతం వెతికే ఓ మనిషి,
నింగికెగిసిన పక్షి కోసం నిచ్చెన వేస్తావు, నింగి నుండీ జారి పడతావు,
ఎండ మావిని చూసి ఏంతో దూరం వెళ్తావు, ఎడారని తెలిసాక ఏడుస్తావు,
నీటి బొట్టును ఒడిసిన తామరను చేరాలని, కాలుజారి బురదలో పడతావు,

అందీ అందని అందలాన ఉండే చందమామ, అందుతుందని అమ్మ చెప్తుంది,
తెలిసీ తెలియక వేసే తప్పటడుగులతో,నడక నేరుస్తావని నాన్న అంటాడు,
అందదని తెలిసీ అందిపుచ్చుకోగలవని, అమ్మ గోరుముద్ద మురిపిస్తే,
తప్పని తెలిసీ తప్పటడుగుల లో తప్పు లేదని నాన్న అంటే,

నీ జీవితం, శాశ్వతంగా, అందని ఆశలతో మొదలౌతుంది,

ఊహ తెలియక ముందు, ఊహల లోకం లో ఉయ్యాల ఊగుతావు,
ఊహ తెలిసాక, ఊహల ఉచ్చులో, ఉరి పోసుకుంటావు,
ఆశల ఆశయాల ఆకాశం లో ఆనందం కోసం అన్వేషించి,
అడియాశల అలజడి లో అయోమయం లో అంతమైపోతావు,

నీ జీవితం, అశాశ్వతమైన ప్రపంచం లో అనిశ్చితితో ముగుస్తుంది,

మహోన్నతమైన మానవ జన్మ, ఓ నవ జన్మ కాకముందే,
మానవ వలయం లో,మానవ విలయం లో,కలిసిపోతుంది,
మహోత్క్రుష్టమైన నీ ఆత్మ, పరమాత్మ ని చేరకముందే,
పరమాత్మ నింద లో, పర ఆత్మ నింద లో, ఆత్మార్పణ చేస్తావు,

'అ'శాశ్వతమైన , ఓ 'మనీ'షి???

-- మీ సాయి కార్తీక్



aSaaSvatamaina ee prapamcham lO, SaaSvatam vetikE O manishi,
ningikegisina pakshi kOsam nichchena vEstaavu, ningi nunDI jaari paDataavu,
enDa maavini chUsi EntO dooram veLtaavu, eDaarani telisaaka EDustaavu,
neeTi boTTunu oDisina taamaranu chEraalani, kaalujaari buradalO paDataavu,

andI andani andalaana unDE chandamaama, andutundani amma cheptundi,
telisI teliyaka vEsE tappaTaDugulatO,naDaka nErustaavani naanna anTaaDu,
andadani telisI andipuchchukOgalavani, amma gOrumudda muripistE,
tappani telisI tappaTaDugula lO tappu lEdani naanna anTE,

nee jeevitam, SaaSvatamgaa, andani aaSalatO modalautundi,

ooha teliyaka mundu, oohala lOkam lO uyyaala oogutaavu,
ooha telisaaka, oohala uchchulO, uri pOsukunTaavu,
aaSala aaSayaala aakaaSam lO aanandam kOsam anVEshinchi,
aDiyaaSala alajaDi lO ayOmayam lO antamaipOtaavu,

nee jeevitam, aSaaSvatamaina prapancham lO aniSchititO mugustundi,

mahOnnatamaina maanava janma, O nava janma kaakamundE,
maanava valayam lO,maanava vilayam lO,kalisipOtundi,
mahOtkrushTamaina nee aatma, paramaatma ni chErakamundE,
paramaatma ninda lO, para aatma ninda lO, aatmaarpaNa chEstaavu,

'a 'SaaSvatamaina , O 'manee ' shi???

No comments:

Post a Comment