లక్ష్యసాధన - గమ్యఛేదన

  • 0



రమ్మన్నా రాదు నిన్నటి నీ కల, తాకి వెళ్ళిన గాలి తరగలా,
నిద్రపోయిన నువ్వు కాదన్న మాత్రాన నిన్నటి నీ లోపం పోతుందా,
మేల్కొంటే ముందడుగు వేస్తావు లోకం నివ్వెరపోయి నిన్ను చూసేట్టు,
వెయ్యాలి చేతల్తో చాటింపు చెవులూరే జయజయధ్వానాలకై.

నిండుగా సాగిపోయే మేఘం వర్షించక మానదు, నీ కష్టం ఫలించక మానదు,
ఏ కొమ్మైనా కాయ ఇవ్వను పొమ్మంటుందా,వెన్నెల నే విరబూయను వెళ్ళిపోమంటుందా,
నీటి బొట్టు నేను నడవలేనని నిలుచుంటుందా,తిరగలేనని భూమి ఆగిందా,
ఆగదు ఏ నిమిషము ఏ లోకం ఆగితే సాగదు మానవ ప్రయాణము.

విజయం వరించక వెళ్ళగలదా, ఓటమి వదలివెళ్ళక వెనకుంటుందా,
నీ ప్రయత్నం, నీ కష్టం, నీ ఓరిమి, నీ తపన,
నువ్వు వదలనంత కాలం , నీ అడుగే తొలి అడుగు, మలి అడుగే ముందదుగు.

చేరగలనా గమ్యం అనే చిన్న అనుమనం, చిన్న తీరం కుడా దాటనివ్వదు,
ఓటమి అనే ఊహ కుడా చివరికి ఊహకందని ఓటమి అవుతుంది,
అందదనే ఆలోచన కూడా, కలవని రైలు పట్టాల్లా కలుసుకోలెవు.

నిప్పుల కొలిమిని చూడందే బంగారం మెరిసిందా?
కాలికింద నలగందే ఏ మట్టైనా చల్లని చలివేంద్రమయ్యిందా?
శిల్పి ఉలి రుచి చూడందే శిలకి రూపం వచ్చిందా?

ఒక్కో ఓటమి మెట్టు ఎక్కుతూ విజయ శిఖరం చేరు,
నిన్నటి నీ కలని సాకారం చేస్తూ నింగిని చేరు,
నీ కల నువ్వు, నీ బలం నువ్వు, నీ విజయం నువ్వు!!


-- మీ సాయి కార్తీక్

No comments:

Post a Comment