మన భాష - తెలుగు భాష

  • 0
తేనేలోలుకు తెలుగు మాట, తీయనైన తెలుగు మాట,
వేయి దివ్వెల కాంతి బాట, తీయనైన తెలుగు పలుకు,
బుద్ధినిచ్చు వెలుగు బాట, తీయనైన తెలుగు మాట,
పలుకు పెంచు పసిడి మాట, తీయనైన తెలుగు మాట.

తీయనైన తెలుగు మాట, చలువనిచ్చు చద్దిమూట,
తీయనైన తెలుగు పలుకు, వెలలేని వెన్నెల జిలుగు,
కమ్మనైన తెలుగు పాట, అమ్మ చేతి వెన్న ముద్ద,
అందమైన తెలుగు నేల, ఆనందాల విరుల కోట,

ఈ కమ్మదనాన్ని అమ్మదనాన్ని సంకరం చేయకు, ఓ తెలుగువాడా,
అతిథిలాంటి ఆంగ్లాన్ని అక్కున చెర్చుకో చాలు, అందలం ఏక్కించకు , ఓ తెలుగువాడా,
అమ్మ వడి ఆనందాన్ని అనుభవించు కాని కాలదన్నకు , ఓ తెలుగువాడా,
మాత్రుభాష మరువకు మరిచి నీ ఉనికిని కోల్పోకు , ఓ తెలుగువాడా.

--  సాయి కార్తీక్

No comments:

Post a Comment