జవాబు లేని ప్రశ్న?

  • 0
చీకటికీ వెలుగుకీ మధ్య సన్నని చితి మంట సూరీడు,
ఉదయపు కిరణాలు చీల్చి రొజుకి స్వాగతం పలుకుతాయి,
వెన్నెల కాంతుల చల్లని తిమ్మిరిలు తలనుంచి వీడతాయి,
తెల్లని పాలలా చంద్రుని చెక్కిలిని ముద్దాడిన వెన్నెల కనుమరుగవుతుంది.


చావుకి బ్రతుకుకి, జన్మకి జన్మకి మధ్యన సన్నని మంట చితి,
చితికి ముందు చిగురాకులాగా రాలిన నీ శరీరం ఏం చెసింది,
ప్రపంచపు వేలకోట్ల జీవరాశి లో ఒకటి గా ఉందా, లేక,
ప్రపంచాన్ని నిర్ధెశించే జీవితం అయ్యిందా,
ప్రతి పని ప్రతి మాటా ఎక్కడ నిన్ను ఆనందపరిచింది,
అదే పని అదే మాట ఎవరిని బాధపెట్టింది,

అశరీరమైన నీ ఆత్మ ఈ శరీరాన్ని వీడీపోవలసిందేగా,
ఆశల తీరమైన నీ జన్మ ఈ శరీరాన్ని వదలలేకపోయిందేగ ?

అన్నింటికి అంతం మంట , అన్నింటికి ఆరంభం మంట,
చితి లో అంతమయిన నీ జన్మ, ఆ చితి తరువాత ఇంకో చోట మొదలవుతుంది,
ఈ జన్మ జన్మల పరంపర ల మధ్య ఏం సాధించావ్ ? ఏం కోల్పోయావ్ ?
సమాధానం లేని ప్రశ్న అడిగానా, సమధిలోనే జవాబు దొరికేనా,

ఏమో ??

జీవితపు చివరంచున పెర్చే చితి లోపు సమాధానం దొరకాలని ఆశిస్తూ.....


By,
Sai Karthik

No comments:

Post a Comment