మానవ సంభంధాలు విష వలయాలు,
నీటి బుడగ అంటారు కాని జీవితపు అంతాలు అవి,
ఎక్కడో వర్షించే మేఘం ఓ నీటి బిందువైతే,
వేల బిందువుల కలయిక ఓ నీటి ప్రవాహమై ముంచెత్తుతుంది.
ఓ ఎడారిలోని ఇసుకరేణువు నీవై ఈ ప్రపంచంలో అడుగిడి,
అనంత రేణువుల్లో అర్థంకాని అంతుబట్టని ఓరాయివిమాత్రమే,
నీ ప్రక్కనున్న ఇసుక రాళ్ళతో పోల్చుకోని తేడాతెలియక తికమక పడతావు,
ఏముంది తేడా, నీలాంటి మరో రాయితో కలిసిన జీవనయానం నీది.
ఆది అంతం లేని ఈ ప్రపంచ పోకడలో పొంతన లేని కోరికలతో,
తీరని ఆశలతో తీర్చలేని భాధలు తనివితీరా అనుభవిస్తూ,
కర్మ అని సర్దుకుని కాసేపు, విధిని వెక్కిరించి కాసేపు, నీ తప్పేంలేదని నవ్వుకుంటావు,
అద్దంలో కనపడేది నీ మొహమే, కాదా? నీ పరిస్థితికి అద్దం నీ మొహమే, కాదా?
అన్నింటికి భాద్యుడివి నువ్వు నీలాంటి నీవాళ్ళు,
నువ్వు నీవాళ్ళు ఏర్పరుచుకున్న విషవలయాలు,
అవే మానవ వలయాలు, ఆశల విలయాలు, ఆగని ప్రళయాలు!!
-- మీ సాయి కార్తీక్
Bagundi ra!!!
ReplyDelete"జీవితం చిన్నదే కానీ
ReplyDeleteజీవిత పరమార్ధం గొప్పది
తల్లీ, తండ్రీ భార్యా పిల్లలు
వీళ్ళందరికంటె జీవితమె నీకు తోడు
ఆ జీవితాన్ని "అర్ధం" చెయ్య
జీవితంలో నిండిన
శూన్యానికి రంగులద్దకు"..when i read ur blog.......just got this poem in my mind