"Bachelor భాధలు "

  • 0




బ్రమ్హచారి భాధలు భగవంతుడికి కూడా అర్థం కావు,

అర్థరహిత అభ్యంతరాలతో ఇల్లు ఇవ్వడంతో మొదలై,

అనుమానాల అవమానాల చూపులు వెంటాదే బాకులౌతయి ,

కొంపతీసి Software అన్నావో రెట్టింపైయ్యే Rent ల తో,

అడ్డంగా దోచేసే Advance లు ఛీ ఏందుకీ జీవితం అనిపిస్తాయి.



కష్టపడి నష్టపోయి ఇల్లు అద్దెకు దిగాక మొదలౌతుంది మరోచరిత్ర,

శుభ్రం కిలోమీటరు దూరంలో, అశుభ్రాన్ని అంటిపెట్టుకుని జీవిస్తారు,

ఉతకని బట్టల గుట్టలు, రోజూ పూసే Scent లు, కట్టని కరెంటు Bill లు,

ఎప్పుడొస్తాయో తెలియని నీళ్ళు, మరిగిపోయాక గుర్తుకువచ్చే పాలు,

గుడిముందుకన్నా ఎక్కువగా గందరగోళంగా గంపెడు చెప్పులు.



ఎవడూ కడగక వదిలేసి విసిరేసి అనాథలై ఎదురుచూసే అంట్లు,

పోనీ కష్టపడదామంటే శుభ్రం చేద్దామంటే ఒంగని ఒళ్ళు,

వారం మొత్తం దొబ్బిచుకోని, రెండ్రోజులు పడుకుందామంటే, పనా?

నువ్వంటే నువ్వని ఒకరికొకరు జాలిగా చుసే బేలచుపుల మధ్య Sunday సమాప్తం,

Monday మళ్ళీ మొదలు వారం తో వైరం, సాగే జీవన ప్రయాణం, బ్రమ్హచారి బతుకు దుర్భరం.


-- మీ సాయి కార్తీక్



No comments:

Post a Comment