జీవితమే ఓక ఆట

  • 0


అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదు అని ఆగవు కొన్ని,
జరిగినవన్నీ నీవల్ల జరగలేదు ఆగినవన్నీ నువ్వాపలేదు,
కాలం ఆడే ఆట ఇది అనుకో నువ్వు ఏం చెయలేక ఆడాలినువ్వు,
ఓడడం గెలవడం నీ ప్రతిభ కాదు, ఫలితం నిర్ణయించేసిన ఈ ఆటలో,

కాలం రాసిన నీ తలరాత, నీ జీవితం మొత్తం ఓ ఎదురీత,
అంతులేని నదిమలుపుల ఈ రాత,కలిసేను సాగరంలో చివరంట,
అయినా పాపం ఇంకా అశిస్తావు నువ్వు,నేననుకున్నది జరిగితే బాగుండని,
నువ్వనుకున్నా అలా కాలం అనుకోదు,ఫలితం నిర్ణయించేసిన ఈ ఆటలో,

ఫలితం నిర్ణయించిన ఈ ఆటలో, నీ ఎదురుచూపులు ఎవరు చూస్తున్నారో?
నువ్వనుకున్నది జరగట్లేదు నువ్వుకోరుకున్నది దక్కట్లేదు, ఈ ఆటలో,
వింతైన ఈ విధి ఆటలో నువ్వు ఓ పావు మాత్రమే,
శాపం నీకు పాపం నీకు, ఆట కాలనిది ఆనందం కాలనిది,

ఫలితం నిర్ణయించేసిన ఈ విధి ఆడే వింత ఆటలో.....

-- మీ సాయి కార్తీక్
--------------------------------------------------------------------------------------------------------

anukunnaamani jaragavu annI anukOlEdu ani aagavu konni,
jariginavannI nIvalla jaragalEdu aaginavannI nuvvaapalEdu,
kaalam aaDE aaTa idi anukO nuvvu Em cheyalEka aaDaalinuvvu,
ODaDam gelavaDam nI pratibha kaadu, phalitam nirNayinchEsina I aaTalO,

kaalam raasina nI talaraata, nI jeevitam mottam O edurIta,
antulEni nadimalupula I raata,kalisEnu saagaramlO chivaranTa,
ayinaa paapam inkaa aSistaavu nuvvu,nEnanukunnadi jarigitE baagunDani,
nuvvanukunnaa alaa kaalam anukOdu,phalitam nirNayinchEsina I aaTalO,

phalitam nirNayinchina I aaTalO, nee eduruchUpulu evaru chUstunnaarO?
nuvvanukunnadi jaragaTlEdu nuvvukOrukunnadi dakkaTlEdu, I aaTalO,
vintaina I vidhi aaTalO nuvvu O paavu maatramE,
Saapam neeku paapam neeku, aaTa kaalanidi aanandam kaalanidi,
phalitam nirNayinchEsina I vidhi aaDE vinta aaTalO.....





No comments:

Post a Comment