ఓ మగువ
చేతులతో చనువులను చుట్టిన ఆ స్త్రీ అందం, సిగ్గు తో తలదించుకున్న వైనం, నన్ను ఆకర్షించాయి,
అందం ఆనందానికి కారణం, ఆకారం అందనికి నిలయం,
వీపు వయారాలు మోము మనోహరాలు,చెంపలపై చక్కరకేళీలా జాలువారు కురులు,
అరమొడ్చిన చేతులతో అందాలతో పాటు, ఆడ ఆభరణాలు అరమరికతో అణచిన ఆ చిన్నది,
అణుకువ మెళకువలా కలిగిన ఆ అపురూపవతి ఆకారం కన్నులకింపుగా ఉన్నది,
సన్నని నడుము నయాగరాల కన్నా వయారంగా వంచి, చెంపలపై చేతులుంచి,
కన్నుల కాంతి వలలు ఎవరిని చుడతాయో తెలియక తలవంచిన తలపులు,జుట్టు జలధారల మధ్య చిక్కుకున్నాయి,
ఎల్లోరా కల్లోలాలు నాకు తెలియవు , కాని నాజుకైన ఈ నయనతార చెసిన కల్లోలం
నయనానందం మాత్రం నన్ను మంత్రముగ్ధున్ని చేసాయి
ఓ మగువా నీ మాయకు వందనం !!
-- సాయి కార్తీక్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment