ఓ స్త్రీ నీకు పాదాభివందనం,
అమ్మవై అందరికి జన్మవైనావు,
చెల్లివై అందరికి చేరువౌతావు,
భార్యవై అనుభందానికి దారివైనావు.
నీ ఓర్పు కలగలిపితే భూమి అవుతుంది,
నిన్ను ఙ్నానం అర్ధిస్తే శారదవే అవవా?
నీ కోపం చూడాలంటే కాళీరూపమే కాదా?
నీ ఐశ్వర్యం కలిగితే లక్ష్మివే అవవా?
కానీ,
జన్మనిచ్చి నీవు రొమ్ము పాలిస్తే,
రొమ్ము జుర్రి మేము గుండెనే తంతాము.
తోబుట్టువై నీవు తోడునవుదామనుకుంటే,
తోడేల్లలా మేము తోలువలుస్తాము.
చెలివై నీవు చెంతనచేరతావు,
మాటలతో నిన్ను చిత్రహింస పెడతాము.
ప్రేయసి లా మారి ప్రేమంతా కురిపిస్తే,
కామంతో నిన్ను కుళ్ళబొడుస్తాము.
మాది,
పురుషహంకారం - మాట వినం ఇది హూంకరం,
ఉన్మాదం - స్త్రీని లోబరుచుకోవడం వినోదం,
పైశాచికం - ఏమాత్రం జాలి లేని అరాచకం,
మాది మగజాతి, (ఆడ)మానవత్వం లేని మ్రుగజాతి!!
-- మీ సాయి కార్తీక్
No comments:
Post a Comment