ఏమో?
ఏమో? సమాధానం లేని ప్రశ్నలకు సమాధానం,
ఏమో? సమాధానం చెప్పలేని ప్రశ్నలకు సమాధానం,
ఏమో? ప్రశ్నలే మనసునిండా ఉంటే వచ్చే సమాధానం,
ఏమో? ప్రశ్నలే సమాధానం అయినప్పుడు చెప్పే సమాధానం,
అర్థంకాలేదా పై నాలుగు వాక్యాలు, ఏమో?
అర్థమైనా ఒప్పుకోలేనివా ఆ నాలుగు వాక్యాలు, ఏమో?
అర్థంలేనివి అనైనా కొట్టిపారేస్తావా పోనీ, ఏమో?
అర్థంవెతికే ప్రయత్నం చేస్తావా పోనీ, ఏమో?
ఏమో? ఏమో? ఏమో? ఏమో?
రంగుల ప్రపంచం మాత్రమే కోరుకునే ఓ మనసా,
కలలేకంటూ, హరివిల్లే ఇల్లు అవ్వాలనేది నీ ఆశ,
వాస్తావాల వాసన చూసేసరికి, అవాక్కయ్యవా?
వర్షం పడ్డ కాసేపే ఉంటుందన్నది మర్చిపోయావా?
ఆలోచించే నీ మెదడుకు అన్నీ తెలుసు,
కాస్తకిందకి చేర వెయ్యి నీ మనసుకూ..
జరిగేది తెలుసూ, జరగనిది తెలుసూ,
తెలిసీ తెలియక కాదు, ఒప్పుకోలేవని కూడా తెలుసూ,
అలా ఒప్పుకోలేక చెప్పే నీ సమాధానం, ఏమో?
సమాధానం ఆశించడం తప్పా? ఏమో?
సమాధానం మనసుకి నచ్చకపోవడం తప్పా? ఏమో?
ఏన్నాళ్ళు ఇలా ఓ మనసా, కుదురుకో, మేలుకో,
వాస్తవాలు గ్రహించు, నీ మెదడు మాట విను..
-- మీ సాయి కార్తీక్
No comments:
Post a Comment