ప్రాణంలోని ప్రాణమా, మౌనంలోని సరాగమా,
నా గుండె గుడి లో దీపం నువ్వు,గుండెసడి తాళం నువ్వు,
చిన్నపిల్లలా ముద్దులొలికే మాటలు నీవి ,విని తరించే భాగ్యం నాది.
వెన్నెల దారుల వేయి కాంతులు, నువ్వు నవ్వితే వెల వెలబోవా!!
నువ్వు తాకిన పూవనం, పులకించేను తోటంతా యవ్వనం,
ఆ పూలదారిలో మనం నడిచే క్షణం, జీవన మధురక్షణం,
నింగి నుంచి తారను తెంచనా? చందమామని చెక్కిలికి రాయనా?
ఆ చుక్కల్లో చిక్కి నవ్వుతావేమో, రాలిపోయేను పాపం నక్షత్రాలు!!
సాగాలి మనం నడకలో నడకై, జీవన తరంగమై,
జన్మంతా నాతో ఉంటావా? నీలో నేనున్నట్టు గా,
మనసులో నన్ను నింపుకుంటావా? నాలో నువ్వున్నట్టు గా,
జగమంతా మనమే ఉందాం జనమెవ్వరు లేనట్టుగా!!
-- మీ సాయి కార్తీక్
No comments:
Post a Comment