దేవుడు చేసిన మనుషులు అంటారు, దేవుడు చేతుల్లోని పావులు అంటారు,
అన్నింటికీ నింద ఆ దేవుడిమీదే, మనుషుల భాధల భారం వాడిదే పాపం,
ఉన్నాడా నీ ఆ దేవుడు, ఉంటే వింటాడా నీ మోర,
కన్నాడా ఏనాడైనా నీ రొద, చుశాడా నీ కళ్ళలో వ్యధ.
ఉన్నాడని వాదించేంతా గొప్పోడిని కాదు నేను,
లేడంటూ నిందించే మనిషిని కాదు నేను,
ఉన్నాడో లేదో అని అనుమానించే స్థాయిలోను లేను నేను,
కానీ, ఉన్నాడని నమ్మేవాళ్ళకి ధైర్యం ఆ పైవాడు,
లేదని నిందించేటోల్లకి ఏమీ చెయ్యలేని వాడు.
నమ్మడం నమ్మక పోవడం నీ ఇష్టం,
మొత్తం దేవుడే అని వదిలేస్తే నీకే కష్టం,
నిన్ను నువ్వు నమ్ముకోడం నీ అద్రుష్టం,
అలా నమ్మి ముందుకు సాగడం మహోత్క్రుష్టం.
గాలిని చుశావా కళ్ళతో ? లేదని శ్వాశ ఆపగలవా?
కాలాన్ని ఆపగలవా చేతితో? చేతికి గడియారం ఉందికదా అని!!
కళ్ళుమూసుకుంటే కనుమరుగవుతాడా మండే సూరీడు?
దేవుడు ఓ నమ్మకం, మనిషి ఓ నిజం,
నిజాన్ని నమ్ము, నువ్వు నమ్మింది నిజంచెయ్యి,
నిజమైన నమ్మకం నీమీద నీకుంటే, దేవుడు కుడా నిజమౌతాడు.
-- మీ సాయి కార్తీక్
No comments:
Post a Comment