శ్రీ వేంకటేశుని వైభవం

  • 0


శ్రీ వేంకటేశుని వైభవం చూతము రారండి,
శ్రీనివాసుని పాదాభివందనం చేతము రండి.
నిత్యకల్యాణ నిజశోభ నెలవంకకైనా కలదా,
ఆ వేవేల రతనాల కాంతి మన స్వామిదే అవదా.

ఏంతో ఎత్తునున్న ఆ ఏడుకొండలవాడు,
జనులందరికి అండగా కొండపై నిలుచున్నాడు.
గోవర్థనమెత్తిన గోవర్ధనుడు ఈ గోవిందుడు,
ఉడత భక్తిని మెచ్చిన రాముడు ఈ రమణుడు.

కలిగించు నీపై భక్తి మా హ్రుదయాలలో,
కురిపించు నీ కరుణ మా లోగిళ్ళలో.
నిన్ను చేరాలనే తలుపు కలిగించు మా మనసులో,
చెర్చుకో నీ పాదాల చెంత హరి పాదరేణువులలో.

అహో ఆ శ్రీ వేంకటేశుని వైభవం,
చాలవు ఈ రెండు కళ్ళు,చాలదు నూరెళ్ళ ఈ జన్మ.
ఆహా ఆ కళ్యాణరాముని కరుణ,
పొందాలి అందరు ప్రతి జన్మలో, జన్మాంతరాలు ఇక లేకుండా.

-- మీ సాయి కార్తీక్

No comments:

Post a Comment