Love Hurts

  • 0




నేరం నాది కాదు, నీది, నరకయాతన నీది కాదు, నాది,
మనసు గాయం మాసి పోదు మదిని వీడి వెళ్ళిపోదు,
నిన్నలోని నిరీక్షన, కన్నీరై కరిగిన క్షణాన,
మనసు గాయం లోతు ఎంతో గుండె అడుగునున్న ఆ కన్నీటినడగాలి.

స్వేచ్చగా వచ్చి నా తలుపు తట్టి వచ్చి చేరిపోయావు,
వెళ్తూ వెళ్తూ స్వఛ్ఛమైన నా గుండె గుడిని మార్చేసావు,
నీతో ఉన్న నిన్నటి ఆ తీపి క్షణం, తలుచుకోలేను మరే క్షణం.

మనసంటే అద్దం అంటారు ముక్కలైతే అతకదంటారు,
నీకోసం పేర్చా ప్రతీ సారీ విరిగిన వెంటనే, నీ కొసం,
గుచ్చుకున్న గాజు భాధంతా గుండెల్లో దాచి,
నిలబడ్డా ప్రతీ సారీ నీ బొమ్మ చుడాలని, ఆ అద్దంలో.

ప్రతి మాటా ప్రతి పలుకు గాలి లో కలవచ్చు కానీ,
మద్యలో అవి తాకిన మది తలుపులు, పదిలం చెశాయి నీ ప్రతి మాటా,
వస్తావో వెళ్తావో వుంటావూ వీడతావో,
నిర్ణయం నాది కాదు, నీది, యాతన నీది కాదు, నాది.

-- మీ సాయి కార్తీక్


------------------------------------------------------------

neram naadi kaadu, needi, narakayatana needi kaadu, naadi,
manasu gayam maasi podu madini veedi vellipodu,
ninnaloni nirikshana, kanneerai karigina kshanana,
manasu gayam lothu enthoo gunde adugununna aa kanneeti nadagali.

swechagaa vachi naa talupu tatti vachchi cheripoyavu,
velthu velthu swachamaina naa gunde gudini maarchesaavu,
neeto unna ninnati aa teepi kshanam, taluchukolenu mare kshanam.

manasante addam antaaru mukklaithee athakadantaru,
neekosam perchaa prati saari virigina ventanee, nee kosam,
guchukunna gaaju badhantaa gundello daachi,
nilabaddaa prati saari nee bomma chudalani, aa addam lo.

prati maata prati paluku gali lo kalavachu kaani,
madhayalo avi taakina madi talupulu, padilam chesaayi nee prati maataa,
vastaavoo veltaavoo vuntaavoo veedataavo,
nirnayam naadi kaadu, needi, yaatana needi kaadu, naadi.


By,
Sai Karthik Parachi.

No comments:

Post a Comment