చావు పుట్టుకలు తలరాతలు ఏ రాత ఎంతో ఎవరికెరుక,
గీతగీసిన బ్రమ్హయ్యకీ తెలియదు ఆ గీత బారెంతో,
జంగమయ్యకు తెలుసు ఎన్ని రోజులో ఎన్ని మెతుకులో,
జారిపడ్డ నుదుటి బొట్టు ఏ తోబుట్టుకు కన్నీరిచ్చేనో,
తెగిపడ్డ తాళికెరుక మెడకు చుట్టుకున్న మోజెంతో,
నేల తాకిన కన్నీటికెరుక చెదిరిన కల కథ ఎంతో,
చావు పుట్టుకలు కావు చేరాతలు, మార్చి రాసి మాయచేయుటకు,
ఏ దూరమో ఏ తీరమో ఏన్నడూ కలవని ఓ ఎండమావో,
ఈరోజిలా నిన్నింతగా నమిలి నలిపే నీ నుదుటి రాత,
విధివంచన వ్యధపెంచిన వేళ,వెక్కి ఎడ్చిన భాధ తీరునా?
అంతా అంతమే, జీవితాంతమే, అని తెలిసి అలిసిన మనసా,
మిగిలేది బూడిదని భూమిలో చేరునని భోరున ఏడవమన్న, ఆ రాత,
చావు పుట్టుకలు తలరాత, ఏ రాత ఎంతో కొలవకు, కొలిచి కుమలకు....
-- మీ సాయి కార్తీక్
vayasuku minchina kalatmakatha
ReplyDeletevayo vrudhudi vaak chaturatha
vedanthi lanti niradambaratha
vara saadhakudi vanti bhavukatha
avasaramaaa ????
urmila.parachi