Life, An Accident and Death

  • 1


చావు పుట్టుకలు తలరాతలు ఏ రాత ఎంతో ఎవరికెరుక,
గీతగీసిన బ్రమ్హయ్యకీ తెలియదు ఆ గీత బారెంతో,
జంగమయ్యకు తెలుసు ఎన్ని రోజులో ఎన్ని మెతుకులో,
జారిపడ్డ నుదుటి బొట్టు ఏ తోబుట్టుకు కన్నీరిచ్చేనో,
తెగిపడ్డ తాళికెరుక మెడకు చుట్టుకున్న మోజెంతో,
నేల తాకిన కన్నీటికెరుక చెదిరిన కల కథ ఎంతో,


చావు పుట్టుకలు కావు చేరాతలు, మార్చి రాసి మాయచేయుటకు,
ఏ దూరమో ఏ తీరమో ఏన్నడూ కలవని ఓ ఎండమావో,
ఈరోజిలా నిన్నింతగా నమిలి నలిపే నీ నుదుటి రాత,
విధివంచన వ్యధపెంచిన వేళ,వెక్కి ఎడ్చిన భాధ తీరునా?
అంతా అంతమే, జీవితాంతమే, అని తెలిసి అలిసిన మనసా,


మిగిలేది బూడిదని భూమిలో చేరునని భోరున ఏడవమన్న, ఆ రాత,
చావు పుట్టుకలు తలరాత, ఏ రాత ఎంతో కొలవకు, కొలిచి కుమలకు....

 -- మీ సాయి కార్తీక్

Rambabu, Software Engineer - రాంబాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్

  • 0
This post is not written by me, 2 years back this one appeared in my company mail box from a group mail. I felt that i should share this, as this is super hilarious and if you are the creator of this article, please let me know.

రాంబాబు ఈ మధ్యనే ఒక కాలేజీ నుండి తన బీ . టెక్ ( మెకానికల్లో అండోయ్ !) పూర్తి చేసుకుని ఒక కంసల్టెన్సీ ద్వారా బెంగుళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు . అప్పటిదాకా ఏదో సాదాసీదాగా , మామూల మనిషిలాగా గడిపేసిన రాంబాబు ఈ సఫ్ట్వేర్ కంపెనీలో ఎలాటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అన్నదే ఈవేళ్టి నా కథాంశం .  

రాంబాబు వెళ్తూనే వాళ్ళ కాలేజీ సీనియర్ అయిన చందుని కలిశాడు . తన హెచ్ . ఆర్ ఓరియంటేషన్ అయ్యాక మళ్ళి కలుద్దమని అనుకున్నారు . రాంబాబు హెచ్ . ఆర్ ఓరియంటేషన్ పూర్తి చేసుకుని వచ్చాడు . చందు రాంబాబును చూస్తూనే " పద బాస్ , ఒక కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము ", అన్నాడు . ఇద్దరూ కలిసి కెఫెటీరియాకి వెళ్ళారు . అక్కడ వాళ్ళ మధ్యన సంభాషణ :

రా : ఏంటి , ఇది మెస్సా ?
చ : మెస్సు లాంటిదే , కెఫిటీరియా అంటారు
రా : ఓహో , ఫుల్ మీల్స్ ఎంత , ప్లేట్ మీల్స్ ఎంత ?
చ : ( ఒక్క నిముషం ఖంగు తిని ) ఒరేయ్ బాబు , ఇక్కడ మీల్స్ ఫ్రీరా , నువ్వెంతైనా తినొచ్చు .
రా : ఆహా , మరి పార్సెల్ కూడా చేసుకోవచ్చా ?
చ : లేదు . అది కుదరదు .
రా : ఓహో , కాఫీ ఆర్డర్ ఇచ్చావా ?
చ : ఇక్కడ మనలాంటి వాళ్ళకు ఆర్డర్ చేసేవాళ్ళే కానీ , తీసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు . పద , కాఫీ మిషన్ చూపిస్తాను .
( రాంబాబు , చందు ఇద్దరూ కాఫీ తెచ్చుకుంటారు )
రా : ప్చ్ ... ఏమైనా ఫిల్టర్ కాఫీ రుచి లేదురా .
చ : అదీ దొరుకుతుంది . యాభై రూపాయలే .
రా : అబ్బే , నాకు ఫిల్టర్ కాఫీ ఇష్టం ఉండదు . ఊరికెనే పోల్చి చెప్పాను అంతే .
చ : ( వీడికి ఇంకా కుర్రదనం పోలేదు . కాలేజీకి ఎక్కువ , కార్పొరేట్ కి తక్కువ ) ఓహో .

A Communal Story and poor morons.

  • 3
Let me tell you a story.

Warning: It’s a communal story, secular claques are warned!

This small communal story happened approximately 4 years back. There were two best friends, let us call them as Ajay and Vijay (Pseudo names). Ajay and Vijay were engineering students and best buddies - they hanged out regularly on the weekends. On a cloudy Saturday Ajay visited Vijay’s house and they planned to spend their Saturday evening by having Pav Bhaji and pani puri at their favorite restaurant. As planned, Ajay and Vijay reached the restaurant, but they were unaware that this weekend would turn out to be a bloody one for them. The restaurant is always crowded and the surrounding area is the hub for micro business and a shopping area for many.

A bomb exploded, killed many – Ajay and Vijay were oblivious to the bomb explosion as the site of the bomb explosion was 5km away from where they were spending their weekend. After five minutes of the bomb explosion in an amusement park, a bomb exploded near the restaurant and killed many, Ajay was one of them. Vijay was not swallowed by death; he survived the bomb blast and was admitted into the hospital. Ajay’s parents were shattered when they heard the news- his body was blown into pieces.

శుభోదయం

  • 0


నీటిబొట్టు నిర్మాణమైన నీ జీవితం, జీవన ధారకాగా
అణువణువు తనువైతే, పరమాణువు లో భాగమైతే,
తెలియని తెలవారు రవి తపనంతా నీ తనివి తట్టగా,
అనందపు అంచున సుర్యోదయపు మంచున, నిను లేపిన ఆ రవికిరణం,
ఓ కొత్త ఆశల తుంపర, తిమ్మిరిలనువంచి,రే నిద్రను తుంచి,
నీలాల నింగినుంచి నీ కలల కొంగులోకి ఒదిగి,మాయమౌతున్న చందమామ లా,
కోకిలగానం  అమ్రుతం మిగిల్చినట్టుగా,ఆ వెన్నెల తీపిని  పంచి పెంచగా,
సుప్రభాత సరాగాలు, సందెకాలపు సుగంధాలు, చిన్నగా నిను కదిపి,
నాన్న అరుపుల మాటున, అమ్మ జడుపుల మాటున, తప్పక తెరిచిన ఆ కన్నులు,
Einstein సూత్రాలననుసరించి, తెరుచుకున్నంత వేగంగా తిరిగి మూసుకుపోతున్నాయి ఆ రెప్పలు ,
అన్ని వైపులనుండి ముంచెత్తిన సునామీలా, ఆ రోజంతా గిర్రున గుర్తొచ్చి,
తప్పక తిప్పలు పడుతూ  లేచి, అబ్బా అధ్భుతుమైన ఆ రవి-చంద్రుల ఉదయ సంధిని చూసి,
ఆ ఆనంద ద్రుశ్యస్వాంతనలో , ఈ ఉదయం , ప్రతి ఉదయం , జీవన ప్రయాణం మొదలు పెడుతూ...

.....ఓ జీవిత నావికుడు

-- మీ సాయి కార్తీక్