నింగి చేరిన నిశీధిని తడిమిన నెలవంక,
నలుకచెందిన కన్నులతో నింగి చూస్తున్న,రాధమ్మ,
తడిసిన చూపులు తన రాజుని మసకబారుస్తాయేమోని,
తుడిచినంతనే మళ్ళీ తలపులతో నింపుకుని తలవంచిన,రాధమ్మ,
రేరాజులో తన రాజు మోముని, రాతిరిలో ఆ నల్లనయ్యని చూస్తూ,
ద్వారం దగ్గర దాక్కోని దొంగలా మెల్లగా వస్తున్న, క్రిష్ణయ్య,
పసిగట్టి పలుకకుండా పొన్న చెట్టు నీడన కూచుంది, రాధ.
ఐమూలగా కన్నయ్య తనదాకా వచ్చేవరకు వేచిచుస్తూ,
వచ్చిన వెంటనే ఓ పూవులా ఆ పద్మనాభుని పాదం చేరి,
మెల్లగా ఎత్తుకుని హత్తుకున్న హరి హ్రుదయం చేరి,
నల్లని రాతిరిలో, చలువైన చందమామ కింద, చుక్కల చాటున,
ఆరధ్యంతో ఆ రాధ, తన్మయత్వంలో తన తనువుని మర్చిపోయి,
నల్లనయ్య ఒడిలో చేరిన ఆ ద్రుశ్య కావ్యం,
అనంతాత్ముడైన ఆ అతిరథుని ఆలింగన ద్రుశ్యం,
అద్భుతం అత్యత్భుతం అనంతాత్భుతం...
-- మీ సాయి కార్తీక్------------------------------------------------------------------------------------------