రోజూ చూసే రోజాపూవు రోజంతా చూడానలనిపిస్తోంది,
నిన్నా మొన్నా నడిచిన దారంతా మళ్ళీ నడవాలనిపిస్తోంది,
ఏప్పుడూ వినే ఆ FM పాటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది,
ఎందుకో ఈ రోజు కొత్తగావుంది,ఏంటా వింత అని తెలుసుకోవాలనుంది,
మదితలుపులు తట్టిన ఓ అఙ్ఞాత వనితా, నీ మాటని విన్నది ఈ మది,
ఎదురుగాలేని నువ్వు ఎదరాగం మీటావా? ఏ రాగం తెలియని నా ఎదలో,
నడకతోనే కవ్వించావు నేను నడిచే నడకలో, నన్ను నేను మరిచేంతగా,
ఏంటో తెలియని హాయిలో ముంచి, కనిపించవు నువ్వు, ఏంటా నవ్వు??
అపర్ణమైన నా హ్రుదయరోజా కొమ్మ, పూసిందనుకుంటా నీ నవ్వు తోనే,
నువ్వు నడిచిన దారంతా నేనూ నడిచా, పూచిన ఆ రొజాతొనే,
విన్న ఆ FM పాటే, నీ మాటతో వింటుంటే, పాటంతా నీ మాటలా ఉంది,
అందుకేనా ఈ రోజు కొత్తగా ఉంది, నన్ను నేనే మరిచేంత కొంగొత్తగా ఉంది.....
-- మీ సాయి కార్తీక్
--------------------------------------------------------------------------------------------------
rOjU chUsE rOjApUvu rOjantaa chUDaanalanipistOndi,
ninnaa monnaa naDichina daarantaa maLLI naDavaalanipistOndi,
EppuDU vinE A paaTE maLLI maLLI vinaalanipistOndi,
endukO ee rOju kottagaavundi,EnTaa vinta ani telusukOvaalanundi,
maditalupulu taTTina O a~maata vanitaa, nee maaTani vinnadi ee madi,
edurugaalEni nuvvu edaraagam meeTaavaa, E raagam teliyani naa edalO,
naDakatOnE kavvinchaavu nEnu naDichE naDakalO, nannu nEnu marichEntagaa,
EnTO teliyani haayilO munchi, kanipinchavu nuvvu, EnTaa navvu??
aparNamaina naa hrudayarOjA komma, pUsindanukunTaa nee navvu tOnE,
nuvvu naDichina daarantaa nEnU naDichaa, pUchina aa rojaatonE,
vinna A paaTE, nee maaTatO vinTunTE, paaTantaa nee maaTalaa undi,
andukEnaa ee rOju kottagaa undi, nannu nEnE marichEnta kongottagaa undi.....