సోయగాల సాగరం

  • 0

వేయి తలల విలయ హోరు, వయ్యారాల వింత జోరు,
బాట లేని బ్రతుకు పోరు, బావుటాల గాలి హోరు,
అందమైన అలల తీరు, ఆగదమ్మ ఎంత పొగరు,
సాయంకలాన సాగరం చేరి హాయిలమ్మ ఒడిన చేజారు!!

అలుపు లేని కెరటపు ఎత్తు, అనంతమైన భూమితోనా నీ పొత్తు,
తేడా తెలియని సాగర తీరం,కలిసి విడిపొయే తీరు విడ్డూరం,
కడుపులో దాచుకున్న నదుల ప్రవహాం, ఎండ వేడికి కరిగేను నీ అహం!!

వెన్నెలో వేయి రంగుల నీవు, ఏడు రంగుల హరివిల్లు మధ్య ఇమిడావు,
అనంతమైన సాగరామా - అనంత రహస్యాల ప్రశాంత నిలయమా,
విలయాలు,ప్రళయాలు,ప్రవాహాలు,విహారాలు, అన్నీ దాచిన నీ వినమ్రాలు,
నీకు లేవు నామరూపాలు - చల్లగా చూడమని మా విన్నపాలు,

నీలి రంగుల నీ ఒడిలో సేదతీరుతున్న.... ఓ సముద్ర ప్రేమికుడు

-- మీ సాయి కార్తీక్